నిజామాబాద్ లో తల్లిపై పాత బట్టలు వేసి నిప్పుపెట్టి చంపిన కసాయి కొడుకు

X
కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరిలో దారుణం జరిగింది. కన్నతల్లిని కుమారుడు సజీవ దహనం చేశాడు. మద్యానికి బానిసగా మారిన కుమారుడు తల్లి భూమవ్వను నిప్పు పెట్టి కాల్చి చంపాడు. తల్లిపై పాత బట్టలు వేసి కసాయి కొడుకు నిప్పు పెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా కుమారుడు మద్యానికి బానిసగా మారి తల్లితో గొడవలు పడుతున్నాడని గ్రామస్థులు వాపోయారు.
Next Story
-
Home
-
Menu
