భీమదేవరపల్లిలో అగ్నిగుండంలో అపశృతి

Kothakonda Veerabhadra Swamy Brahmotsavam
X

Kothakonda Veerabhadra Swamy Brahmotsavam

భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా ఆలయంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు ఘనంగా అగ్నిగుండాలను నిర్వహించారు. భక్తులు అగ్ని గుండాలను దాటుతుండగా కరీంనగర్‌కు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి అందులో పడిపోయాడు. అతడు స్వల్పంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అగ్ని గుండాలను దాటేటప్పుడు భక్తులకు నిర్వహకులు పలు సూచనలు చేశాడు. ఒక్కొక్కరిని ఒంటరిగా పంపించి అగ్నిగుండాలను దాటించారు.

Tags

Next Story