చనిపోదామని ఉరితాళ్లు బిగించుకున్నారు... కానీ ప్రియురాలు మృతి.. ప్రియుడు అరెస్టు

చనిపోదామని ఉరితాళ్లు బిగించుకున్నారు... కానీ ప్రియురాలు మృతి.. ప్రియుడు అరెస్టు
X

తిరునంతపురం: ఓ యువతి ఆత్మహత్య కేసు విచారణలో అనూహ్య మలుపులు తిరిగింది. ప్రియుడు ఆమెను ఆత్మహత్యకు ప్రేరిపించి అక్కడి నుంచి అతడు పారిపోయాడు. ఈ సంఘటన కేరళ రాష్ట్రం కోఝికోడ్ ప్రాంతంలో జరిగింది. ఎలాతుర్ కు చెందిన వైశాఖన్ అనే వ్యక్తి తన దగ్గర బంధువైన యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలిస్తే భయం ప్రియురాలి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. యువతితో అక్రమ సంబంధం కొనసాగిస్తే బంధువులలో తన పరువు పోతుందని ఆమె పలుమార్లు చెప్పడంతో పాటు పుల్‌స్టాప్ పెడుతామని చెప్పాడు. ప్రియుడు లేకుండా తాను బతకలేనని ప్రియురాలు పలుమార్లు ప్రియుడికి చెప్పడంతో వివాహేతర సంబంధం కొనసాగించాలని కోరింది. ఇద్దరం కలిసి చనిపోదామని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమెను తాను పని చేసే మలిక్కడావు గ్రామంలోని వర్క్‌షాపుకు రమ్మని కబురు పంపాడు. ఇద్దరు వేర్వేరు కూర్చీలపై నిలబడి మెడకు తాళ్లు బిగించుకున్నాడు. ఆమె కూర్చీని తొలగించింది కానీ ప్రియుడు కూర్చీ దిగి పారిపోయాడు. యువతి ఉరి బిగించుకొని అక్కడే చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. సిసిటివి పుటేజీని గమనించగా యువతితో, వైశాఖన్ వర్క్‌షాపులో వెళ్లినట్టు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచే ఆమెతో సంబంధాన్ని కొనసాగించడంతో అతడిపై పోక్సో చట్టంతో పాటు పలు కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Next Story