కృష్ణాజలాల కుదరని సయోధ్య

కృష్ణాజలాల  కుదరని సయోధ్య
X

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్, తె లంగాణ మధ్య మరోసారి ఏకాభిప్రా యం కుదరలేదు. నీటి అవసరాలు, కేటాయింపులు, వినియోగంపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలకు కట్టుబడ్డా యి. నాగార్జునసాగర్ నుంచి నీటి వి డుదలపై కొంత సానుకూలత వ్యక్తమై నా, కృష్ణా డెల్టా సిస్టమ్ (కేడీఎస్)కు అ దనంగా 19 టీఎంసీలు ఇవ్వాలన్న ఏపీ డిమాండ్‌ను తెలంగాణ వ్యతిరేకించింది. దీంతో తుది నిర్ణయం లేకుండా నే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది.సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన సమావేశాని కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు హాజరయ్యారు. నాలుగు గంటల పాటు చర్చలు సాగాయి. వ చ్చే మూడు నెలల నీటి అవసరాలపై చర్చించగా, ఈ కాలానికి 30 టీఎంసీ లు కేటాయించాలని తెలంగాణ కోరిం ది. నాగార్జునసాగర్ నుంచి 9 టీఎంసీ లు, కేడీఎస్‌కు మరో 10 టీఎంసీలు ఇ వ్వాలని ఏపీ పట్టుబట్టింది. కేడీఎస్‌కు అదనపు నీటి

విడుదలకు తెలంగాణ అంగీకరించలేదు. వచ్చే మూడు నెల లు నాగార్జునసాగర్ నుంచి నెలకు 5 టీఎంసీల చొప్పున నీరు ఇవ్వాలని ఏపీని కోరినట్లు తెలంగాణ ఈఎన్సీ ర మేశ్‌బాబు తెలిపారు. సాగర్‌లో 40 టీ ఎంసీలు అందుబాటులో ఉన్నాయని, హైదరాబాద్ తాగునీటికి 15 టీఎంసీలు కేటాయిస్తే 25 టీఎంసీలే మిగులుతాయని వివరించారు. కుడి, ఎడమ కాలువల పంపకాల మేరకే నీటిని వినియోగించాలని, ఏపీ కోరిన అదనపు 10 టీఎంసీలు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.సాగర్‌లో తెలంగాణకు 281 టీఎంసీల కేటాయింపు ఉండగా, ఇప్పటివరకు 65 టీఎంసీలు వినియోగించుకున్నామని రమేశ్‌బాబు తెలిపారు. ఏపీకి 152 టీఎంసీల కేటాయింపు ఉండగా, 103 టీఎంసీలు వినియోగించుకుందని పేర్కొన్నారు. అందువల్ల కేడీఎస్‌కు అదనపు నీరు కోరడం సమంజసం కాదని తెలంగాణ వాదించింది. ఏపీలో వర్షాలు కురిసినందున అదనపు నీటి అవసరం లేదని, కేడీఎస్‌కు ఒక్క నీటి చుక్క కూడా అదనంగా ఇవ్వబోమని రమేశ్‌బాబు చెప్పారు.


కేడీఎస్‌కు 10 టీఎంసీలు ఇవ్వాల్సిందే: ఏపీ

సాగర్ నుంచి నీటితో పాటు కృష్ణా డెల్టా అవసరాలకు అదనపు నీరు కేటాయించాలని ఏపీ కోరింది. నవంబర్ 13న పలు లేఖల ద్వారా బోర్డును కోరినట్లు ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి తెలిపారు. సాగర్ కుడి కాలువకు 8 టీఎంసీలు, ఎడమ కాలువకు ఒక టీఎంసీ, కేడీఎస్‌కు మరో 10 టీఎంసీలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కుడి, ఎడమ కాలువల నీటి విడుదలకు బోర్డు అంగీకరించినా, కేడీఎస్‌పై నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఏడాది కేడీఎస్‌కు నీరు విడుదల కాలేదని బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో రెండు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదని నరసింహమూర్తి పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదని వివరించారు. మరోసారి బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

తెలంగాణ ముందుగానే ఎక్కువ నీటిని వినియోగించుకోవడం వల్ల ఏపీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని నరసింహమూర్తి ఆరోపించారు. కేడీఎస్ నీటి వాటాలో ఏపీ హక్కులను వదులుకోదన్నారు. . కేడీఎస్ నీటి విడుదలపై త్వరలో మరోసారి బోర్డు సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.పల్నాడు వాటర్ గ్రిడ్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రాజెక్టు సమాచారం పత్రికల్లో వచ్చిన తర్వాతే తమకు తెలిసిందని ఏపీ అధికారులు చెప్పినట్లు సమాచారం. దీనిపై తెలంగాణ అధికారులు ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాలు డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో సమస్య కొలిక్కి రాలేదు. కేడీఎస్ అదనపు నీటి కేటాయింపులే ప్రధాన వివాదంగా మారాయి. త్వరలో మరోసారి బోర్డు సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags

Next Story