రూ. 250 కోట్ల ప్రభుత్వ భూమి కేవలం రూ. 7 కోట్లకే

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని టెస్సెరాక్ట్ సంస్థ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. ఫోర్త్ సిటీ పరిధిలో టెస్సెరాక్ట్ కంపెనీకి రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా కేటాయించారని బిఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి ప్రభుత్వ భూముల కేటాయింపుపై సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి టెస్సెరాక్ట్ కంపెనీ పేరుతో అక్రమంగా భూములు కేటాయించారని ఆరోపించారు.
అధికారం దుర్వినియోగం కాదా?
సుమారు రూ. 250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ. 7 కోట్లకే కొండల్ రెడ్డికి ఎలా కేటా-యించారని కెటిఆర్ ప్రశ్నించారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? కుటుంబ పాలన కాదా? అని నిల-దీశారు.
అన్నదమ్ములకు రూ.వందల కోట్ల భూములా?
ఒకవైపు సిఎం రేవంత్ రెడ్డి, మరోవైపు ఆయన సోదరులు అనుముల కొండల్ రెడ్డి, అనుముల జగదీశ్వర్ రెడ్డి. రూ.1000 కోట్ల పెట్టుబడి పేరుతో సొంత కుటుంబ సంస్థలకే ప్రభుత్వ భూములు, రాయితీలు, మిన-హాయింపులు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్
ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాయాజాలం నడుపుతోందని కెటిఆర్ ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఇప్పుడు వేరే వాటికి వాడడం చట్టపరంగా చెల్లదన్నారు. రేపు కోర్టు కేసుల్లో పెట్టుబడిదారులే నష్టపోతారని, రేవంత్ కుటుంబ ప్రయోజనాల కోసం పారిశ్రామికవేత్తలు బలికావద్దని హెచ్చరించారు.
ఈడీ, సీబీఐ ఎక్కడ?
ఈడీ, ఐటీ, సీబీఐలు మా మీద కేసులు పెట్టడానికే ఉన్నాయా?.. అధికారంలో ఉన్నవారి అవినీతి కనిపిం-చడం లేదా..? తెలంగాణ ఎటిఎంగా మారిందని ప్రధాని మోదీ, అమిత్ షా లే అంటున్నారని, దొంగలను ఎందుకు పట్టుకోవడం లేదని కేటీఆర్ నిలదీశారు. శాసనసభలో తమ గొంతు నొక్కి సస్పెండ్ చేశారని.. అందుకే నేరుగా భూమి వద్దకే వచ్చి ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు. ఈ భూకుంభ-కోణంపై ప్రతి గ్రామంలో సదస్సులు పెట్టి, న్యాయపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు మంచి-రెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
Home
-
Menu
