రేవంత్‌కే హాలిడే ఇద్దాం

కాంగ్రెస్ రాబందుల రాజ్యంలో రైతులకు అన్నీ కష్టాలే
ప్రభుత్వ అనాలోచితం కారణంగానే విద్యుత్ కోతలు
రేవంత్ పాలనలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని రోజులొచ్చాయి
మూడుసార్లు రైతుబంధు ఆపిన దివాలాకోరు ఎవరు?
ఆదిలాబాద్ రైతుగర్జన సభలో కేటీఆర్ ధ్వజం
మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి/తలమడుగు: రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ రాబందులు రా జ్యంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మం త్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ పాలనలో కరెంట్ బంద్, నీళ్లు బంద్, వ్యవసా యం బంద్‌తో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన గుర్తు కు వస్తుందని విమర్శించారు. రైతులను పంటలే వేయొ ద్దని సూచిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి.. మనమే హాలిడే ప్రకటిద్దామని పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన రైతు గర్జన సభలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హా మీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శిం చారు. రైతుబంధును మూడుసార్లు ఆపిన దివాలా కోరు ఎవరు?, ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి రైతు లను మోసం చేసింది ఎవరు?, కౌలు రైతులకు అన్యా యం చేసింది ఎవరు అని ప్రశ్నించారు. రైతు పచ్చగా ఉంటే గ్రామాలు పచ్చగా ఉంటాయని, గ్రామాలు పచ్చ గా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దివాలా తీసిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు అడగకుండానే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టబడి సాయం,24 గంటల నిరంతర విద్యుత్తును అందించారని గుర్తుచేశారు. రైతుబంధు పథకం ద్వారా సుమారు రూ.73 వేల కోట్లను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. వ్యవసాయం ఆగిపోతే రైతులు, వ్యవసాయ కూలీలు ఎలా బతుకుతారని నిలదీశారు. సభకు వచ్చే ముందు తలమడుగుకు వెళ్లామని, అక్కడ నలుగురు రైతులు మృతి చెందిన ఘటన ఎంతో కలిచివేసిందని వాపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా నీటి లభ్యత ఉన్నప్పటికీ, ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని కేటీఆర్ విమర్శించారు.
ఈ ఏడాది గోదావరిలో సుమారు 750 టీఎంసీల నీరు వచ్చిందని, ఆ నీటిని సద్వినియోగం చేసుకోకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులను కరువు పరిస్థితుల నుంచి కాపాడవచ్చని వివరించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం కావాలనే నీటిని ఎత్తిపోయడం లేదని విమర్శించారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి రైతుల ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. బెల్లంపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, రామగుండం ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో విద్యుత్తు కొరత ఏర్పడిందని, విద్యుత్తు సమస్య కారణంగా అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మండిపడ్డారు. సాగునీటిని సరఫరాకు, విద్యుత్తును 24 గంటలు సరాఫరా చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదని దుయ్యబట్టారు. యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టే పరిస్థితులు మళ్లీ వచ్చాయని అన్నారు. రైతుబంధు, రైతు భరోసా పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి సమస్యలను పరిష్కరించి రైతులకు అండగా నిలవాలని కేటీఆర్ సూచించారు. లేకుంటే రాబోయే కాలంలో రైతుల పక్షాన పెద్దపెత్తున ఉద్యమిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
రైతులు అధైర్యపడొద్దు: కేటీఆర్
రైతులు ఎవరూ అధైర్యపడి ఆత్మహత్య చేసుకోవద్దని, రెండేళ్లు ఓపిక పడితే మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాతకాని పాలన వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం తలమడుగు, భీంపూర్, భోథ్ మండలాలకు చెందిన రైతులు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, ఒక్కో రైతు కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ చేతులమీదుగా అందజేశారు. అంతకుముందు భోథ్ గ్రామంలో సర్పంచ్ లకా్ష్మరెడ్డి తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన నూతన బస్టాండ్‌ను కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు రెండు సంవత్సరాలు ఓపిక పడితే రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. అన్నదాతలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. జిల్లాలో 20 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, తలమడుగు మండలాన్ని మాత్రం విస్మరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. తలమడుగు మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎలుగు రాజన్న, మండల బీఆర్ఎస్ నాయకులు తోట వెంకటేశ్, బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, కాటిపెళ్లి వసంత్ రెడ్డి, పిడుగు సంజీవ్‌రెడ్డి, ముడుపు కేదారేశ్వర్ రెడ్డి, కాటిపెళ్లి శ్రీనివాస్‌రెడ్డి, పిడుగు అభిరాం రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
