మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సురుకు పెట్టాలి: కెటిఆర్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సురుకు పెట్టాలని, కాంగ్రెస్ మోసాలకు అడ్డుకట్ట వేయాలని, మరోసారి కెసిఆర్‌ను సిఎం చేస్తేనే అభివృధ్ధి సాధ్యపడుతుందని బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కెటిఆర్ అన్నారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 22 వార్డుల్లో ప్రచారం చేసిన కెటిఆర్ బివైనగర్, వెంకంపేట, రాజీవ్‌నగర్,న్యూ బస్‌స్టాండ్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో కెటిఆర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల తరువాత రైతు బంధు వేస్తానని సిఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని, ఇప్పటికి ఎన్ని పంట కాలాలు అయిపోయాయి, ఎన్ని సార్లు రైతు బంధు వేసిండో చెప్పాలన్నారు. ఇప్పటికి ఎన్ని పంటకాలాలు గడిచిపోయాయి, అప్పుడెందుకు రైతు బంధు వేయలేదని కెటిఆర్ నిలదీశారు. మున్సిపల్ ఎన్నికలు రైతుబంధు నేతన్నల ఖాతాలో వేయడానికి ముఖ్యమంత్రికి ఏమి అడ్డుగా ఉందో చెప్పాలన్నారు.మున్సిపల్ ఎన్నికలకు ముందు రైతులకు ఆశచూపి మరోసారి మోసం చేయాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నాడన్నారు.కాంగ్రెస్ ఎన్నికలకు ముందు అడ్డగోలుగా హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అడ్డగోలు హమీలు అమలు చేయలేదన్నారు. మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసేలా కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సురుకు పెట్టాలని, కాంగ్రెస్ మోసాలకు అడ్డుకట్ట వేయాలని లేదంటే కాంగ్రెస్ తన మోసాలను కొనసాగిస్తూనే ఉంటుందని కెటిఆర్ అన్నారు.
-
Home
-
Menu
