క్యాతన్ పల్లి ఘటన పై గవర్నర్ స్పందించాలి: కెటిఆర్

రానున్న రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని, ప్రజా స్వామ్యాన్ని కాపాడి రాజ్యాంగ బద్దంగా వ్యవహరించి అధికారుల పై, క్యాతన్ పల్లి ఘటనపైన గవర్నర్ స్పందించి చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ కుంట్ల తారక రామారావు అన్నారు. ఆదిలాబాద్ జైల్లో రిమాండ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించారు. ఆయన వెంట బి ఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌తో పాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్‌లను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లితో పాటు ఆసిఫాబాద్‌లో జైళ్లు ఉన్నప్పటికీ వాళ్లను అక్కడ పెట్టకుండా కక్షపూరితంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తీసుకువచ్చి పెట్టడం దుర్మార్గమన్నారు.
కేతనపల్లిలో ప్రజలు ఇచ్చిన తీర్పును మంత్రి వివేక్ శిరసావహించాల్సింది పోయి ఇలా ప్రజా తీర్పును కాలరాయడం సరికాదన్నారు. కోరం ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి, చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా పడేలా చేశారని ఆరోపించారు. కౌన్సిల్‌కు మద్యం తాగి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు? రాజిరెడ్డి గారి కారు ధ్వంసం చేసిన వారిపై కేసులు ఉండవు కానీ, మా కౌన్సిలర్లపై మాత్రం అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజ సమన్నారు.బాల్క సుమన్, కోవా లక్ష్మీలను ఎమ్మెల్యేలుగా ఉండి కూడా లోపలికి పంపించకుండా కేవలం మంత్రిని ఎలా పంపిస్తారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు,మా కార్యకర్తల పై దాడి చేశారు. పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులతో అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలు స్టేషన్‌కు వచ్చి మరీ కొడుతున్నారని ఆరోపించారు. ఈ రకమైన దాడులు మంచివి కావన్నారు. పోలీస్ కవాతు ప్రజలకు రక్షణ కల్పించాలి. ప్రజల్లో విశ్వాసం నింపాలి. కానీ జనగామ, ఇబ్రహీంపట్నం, ఆమంగల్, క్యాతన్‌పల్లిలో బీఆర్‌ఎస్ నాయకులను, కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే పోలీసులు కవాతు చేశారని అన్నారు. ఇబ్రహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా ఎన్నికను అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు.
అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీల మైత్రి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ ఎంపీ పోలీసులను పట్టుకుని అడ్డగోలుగా బూతులు తిట్టినా ఇప్పటివరకు వారిని అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై, క్యాతన్‌పల్లి ఇన్సిడెంట్ పైన గవర్నర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేపు బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఎవరూ మిమ్మల్ని కాపాడలేరని, మీరు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందస్తుగా హెచ్చరించారు.
-
Home
-
Menu
