60 సార్లు ఢిల్లీ వెళ్లిన సిఎం సాధించిందేంటి..?: కెటిఆర్

కేంద్ర బడ్జెట్‌లో పేదలు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధి హామీని కుదించారని కెటిఆర్ విమర్శించారు. ఎరువుల రాయితీ, ఆహార రాయితీతో పాటు స్వచ్ఛ భారత్‌కు నిధులు కూడా తగ్గించారని అన్నారు. వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, ఫార్మాకు హైదరాబాద్ కేంద్రం అయితే.. బయో ఫార్మా తయారీకి రూ.పది వేల కోట్లు కేటాయించి తెలంగాణకు రూ.10 కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ఢిల్లీకి 60 సార్లు వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి సాధించిందేంటి..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం సున్నా అని విమర్శించారు. తెలంగాణకు బిజెపి ఇచ్చేది ఇదేనా..? అని నిలదీశారు. హై స్పీడ్ రైల్ కారిడార్ కేటాయించామని గొప్పగా చెబుతున్నారని,
తెలంగాణ భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉంది..కాబట్టి కారిడార్ హైదరాబాద్ మీదుగా వెళ్లక తప్పదని తెలిపారు. తెలంగాణకు హై స్పీడ్ ట్రైన్లు ప్రత్యేకంగా ఇచ్చినట్లు చెప్పడం హాస్యాస్పదం అని కెటిఆర్ అన్నారు. దావోస్ ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడులు ఎన్ని మెటీరియలైజ్ అయ్యాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. దావోస్‌లో జరిగిన ఒప్పందాలు విచిత్రంగా ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్రలో కేబినెట్‌లో ఉండే మంత్రి ఆ రాష్ట్ర సిఎంతో దావోస్ ఒప్పందం చేసుకున్నారని, అలాగే జూబ్లీహిల్స్‌లో ఉండే సిఎం రేవంత్‌రెడ్డి, మెగా కృష్ణారెడ్డి కూడా దావోస్‌లో ఒప్పందాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
-
Home
-
Menu
