తక్షణమే కాజీపేట రైల్వే డివిజన్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్‌ను త క్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి ఒక సమగ్రమైన లేఖ రా శారు. ఈ లేఖను పార్టీ ఎంపీల బృందం బుధ వా రం కేంద్ర మంత్రికి స్వయంగా అందజేశారు. కా జీపేట డివిజన్ ఏర్పాటుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న అంతర్గత పునర్వ్యవస్థీకరణ, దక్షిణ తీర రైల్వే కార్యకలాపాల ప్రారంభం వల్ల సికింద్రాబా ద్ డివిజన్‌పై పనిభారం విపరీతంగా పెరిగి ందని తన లేఖలో ఎత్తిచూపారు. తాజా గణాంకాల ప్ర కారం, ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధి 2,755 ట్రాక్ కిలోమీటర్లుగా ఉందని, రాబో యే కాలంలో వాడి-రాయచూర్, విష్ణుపురం-బీబీనగ ర్ డబ్లింగ్ పనులు పూర్తయితే, ఇది సుమారు 3,150 కిలోమీటర్లకు చేరుకుంటుందని ఆయ న పేర్కొన్నారు. ఇది భారతీయ రైల్వేల పరిపాలనా ప్రమాణాల ప్రకారం ఒక డివిజన్‌కు ఉండాల్సిన పరిమితి కంటే చాలా ఎక్కువని వివరించారు. మిగతా డివిజన్లతో పోలిస్తే సికింద్రాబాద్‌పై ఉన్న ఒత్తిడిని వివరిస్తూ విజయవాడ, గుంతకల్ డివిజన్లు సుమారు 2,200 ట్రాక్ కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, గుంటూరు డివిజన్ కేవలం 900 కిలోమీటర్ల లోపే ఉందని గుర్తు చేశారు.
అనేక చో ట్ల ప్రతిపాదిత కాజీపేట డివిజన్ కన్నా తక్కువ కి లోమీటర్లు ఉన్న డివిజన్లను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ భారీ అసమతుల్యత వ ల్ల సికింద్రాబాద్ డివిజన్ నిర్వహణ అత్యంత సం క్లిష్టంగా మారిందని, ఇది రైళ్ల రాకపోకల సాంద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కాజీపేట కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేయడం అటు పరిపాలన సౌల భ్యం, ఇటు కార్యకలాపాల రీత్యానూ అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపాదిత కాజీపేట డివిజన్‌లో కాజీపేట-బల్లార్షా, పెద్దపల్లి-నిజామాబాద్, కాజీపేట-ఎర్రుపాలెం, డోర్నకల్-మణుగూరు అండ్ సత్తుపల్లి వంటి కీలక మార్గాలను చేర్చడం ద్వారా సుమారు 2,000 ట్రాక్ కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా నిర్వహించవచ్చని సూచించారు. రైల్వే శాఖ ప్రస్తుతం పరిశీలిస్తున్న కొన్ని మార్పులపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెద్దపల్లి-నిజామాబాద్ సెక్షన్‌ను హైదరాబాద్ డివిజన్‌కు బదిలీ చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, భౌగోళిక సామీప్యత దృష్ట్యా దానిని కాజీపేట డివిజన్‌లోనే ఉంచాలని డిమాండ్ చేశారు. అలాగే, లాతూర్ రోడ్-పర్లీ వైజనాథ్ సెక్షన్‌ను నాందేడ్ డివిజన్‌కు మార్చే అంశాన్ని కూడా పునఃపరిశీలించాలని విన్నవించారు.
కాజీపేట ప్రధాన రైలు మార్గాల కూడలిలో ఉండటం, అక్కడ ఇప్పటికే రైల్వే తయారీ యూనిట్, మహబూ బాబాద్‌లో మెయింటెనెన్స్ కేంద్రాల అభివృద్ధి జరుగుతున్నందున, ఈ ప్రాంతం జాతీయ స్థాయిలో కీలక రైల్వే హబ్‌గా మారుతుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు, సిమెంట్, ఎరువులు ఆహార ధాన్యాల రవాణా ద్వారా రైల్వేకు ఈ ప్రాంతం నుండి భారీ ఆదాయం లభిస్తుందని, ఇంతటి ప్రాధాన్యత ఉన్న మార్గాలపై ప్రత్యేక పరిపాలనా పర్యవేక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్‌పై ఉన్న ఆర్థిక భారం వల్ల నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కాజీపేట డివిజన్ ఏర్పాటుతో కార్యకలాపాల వికేంద్రీకరణ జరుగుతుందని, తద్వారా ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో రైల్వే సేవలు మెరుగుపడటమే కాకుండా, సమ తుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. చివరగా, భారతీయ రైల్వేల సంస్థాగత బలోపేతానికి, తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చడానికి ఈ డివిజన్‌ను తక్షణమే ఆమోదించాలని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
-
Home
-
Menu
