దగ్గర లోనే ప్రభుత్వన్ని బర్తరఫ్ చేసే రోజులు: కెటిఆర్

ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర లోనే ఉన్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు. శనివా రం కరీంనగర్ లోని అంబేడ్కర్ స్టేడియంలో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో యువ సమరభేరి పేరుతో నిర్వహించిన సభలో కెటిఆర్ పాల్గొని మాట్లాడారు.100 రోజు లు అని చెప్పి1000 రోజులు మోసంచేసిన ధోకేబాజ్ (మోసగాడు)రాజీనామా చేయాల్నా లేదా.. అని అడిగారు. నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీ ఇయ్యాళ్ల పెద్ద పెద్ద మాటలుమాట్లాడుతోంది.కోట్ల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ..మీ పార్టీని నిషేధిత జాబితా లో పెట్టే రోజు దగ్గరలో ఉంది. 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చేతకాని పాలనతో ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే సిఎం రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Tags
-
Home
-
Menu
