గజ్వేల్‌లో చెట్టును ఢీకొట్టిన బైక్: యువకుడు మృతి

X
గజ్వేల్: సిద్దిపేట జిల్లా కూకునూర్ పల్లి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మద్దూరు మండలం గాగిల్లాపూర్‌కు చెందిన నారదాస్ పవన్(25) ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. కుకునూర్ పల్లి మండల కేంద్రానికి సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గాగిల్లాపూర్ గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Next Story
-
Home
-
Menu
