అత్తతో అల్లుడి వివాహేతర సంబంధం... కారుతో ఢీకొట్టి హత్య

కుకునూరుపల్లి: సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అల్లుడిని తమ్ముడితో కలిసి భర్త హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో షాహిద్(25) అనే యువకుడు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహ్మద్ ఖదీర్ అనే వ్యక్తి జూనయర్ లైన్‌మన్ పని చేస్తున్నాడు. ఖదీర్ భార్యతో షాహిద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఖదీర్‌కు తెలియడంతో పలుమార్లు షాహిద్‌ను హెచ్చరించాడు. అతడిలో మార్పు రాకపోవడంతో షాహిద్‌ను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల 22న షాహిద్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చిన్న కిష్ణాపూర్ సమీపంలో ఖధీర్‌ను కారుతో ఢీకొట్టాడు. అనంతరం అతడిపై నుంచి పలుమార్లు కారు పోనిచ్చాడు. అతడు చనిపోయాడు అని నిర్థారించుకున్న తరువాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. షాహిద్ తీవ్ర గాయాలతో రోడ్డుపై కనిపించడంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే షాహిద్ మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఖదీర్ తమ్ముడు షబ్బీర్ తానే షాహిద్‌ను హత్య చేశానని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. ఇద్దరు సోదరులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
-
Home
-
Menu
