లాలాపేటలో డివైడర్ ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి

X
హైదరాబాద్: గౌతం నగర్ లాలాపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. యువకులు కీసర నుంచి అల్పాహారం కోసం తార్నాక వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
