గతంలో అమరావతికి జగన్ మద్దతు తెలిపారు : లావు శ్రీకృష్ణదేవరాయులు

గతంలో అమరావతికి జగన్ మద్దతు తెలిపారు : లావు శ్రీకృష్ణదేవరాయులు
X

అమరావతి: బుధవారం ఎపి పార్లమెంటుకు అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశ పెడతామని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. బిల్లు ద్వారా రైతులకు మరింత భరోసా అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు నమ్మకంతో రాజధానికి భూములు ఇచ్చారని, ఎపి పరిస్థితులను కేంద్రం అర్థం చేసుకుందని తెలియజేశారు. గతంలో అమరావతికి మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలిపారని, అధికారం వచ్చాక జగన్ మాటలు మార్చారని శ్రీకృష్ణదేవరాయులు విమర్శించారు. రాజధాని అమరావతిని అడ్డుకోవాలని చూశారని, జగన్ అసెంబ్లీకి రాకపోయినా ప్రజలు పట్టించుకోరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతే శాశ్వత రాజధానని లావు శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు.

Tags

Next Story