జాతీయ రహదారిపై చిరుత మృతి

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని మన్ననూర్ రేంజ్ పరిధిలో జాతీయ రహదారి–765 శ్రీశైలం రహదారిపై ఆదివారం చిరుత పులి కూన మృతి చెందింది. మృతి చెందిన చిరుతపులి మృతదేహాన్ని సోమవారం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాలు, అటవీ శాఖ ప్రామాణిక విధానాల ప్రకారం సంఘటనా స్థలం నుంచి చిరుత మృతదేహాన్ని సురక్షితంగా తరలించిన అధికారులు, అమ్రాబాద్ వెటర్నరీ డాక్టర్ వి. రాజు ఆధ్వర్యంలో శవపరీక్ష నిర్వహించారు. చిరుత మృతి చెందిన కారణాన్ని నిర్దేశించేందుకు అవసరమైన శాస్త్రీయ పరీక్షల కోసం నమూనాల ను సేకరించారు. శవపరీక్ష అనంతరం వన్యప్రాణుల మృతదేహాల నిర్వహణకు సంబంధించి ఎన్టీసిఎ సూచించిన నిబంధనల మేరకు అధికారుల సమక్షంలో మృతదేహాన్ని దహనం చేశారు. వన్యప్రాణి అవయవాలు, చర్మం, గోళ్లు, దంతాలు తదితర భాగాలు అక్రమంగా వినియోగించబడ కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణి నేరాలకు ఎలాంటి అవకాశం లేకుండా మృతదేహాన్ని నిబంధనల ప్రకారం పూర్తిగా దహనం చేసినట్లు పేర్కొన్నారు.
అటవీ ప్రాంతాల్లో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని, ముఖ్యంగా వన్యప్రాణుల సంచార ప్రాంతాల్లో వేగ నియంత్రణ పాటించాలని అటవీ అధికారులు సూచించారు. రహదారులపై వన్యప్రాణుల రక్షణకు అవసరమైన చర్యలను నిరంతరం చేపడుతున్నామని తెలిపారు.వన్యప్రాణుల మృతదేహాల నిర్వహణలో శాస్త్రీయ విధానం, పారదర్శకతతో పాటు ఎన్టీసిఎ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తున్నామని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధికారులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర, ఐఎఫ్ఒ, అమ్రాబాద్ ఎఫ్డీఒ యశ్ చంద్ర ప్రకాశ్ సింఘాల్, ఐఎఫ్ఒ, మన్ననూర్ ఎఫ్ఆర్ఓ సవిత, అమ్రాబాద్ ఎఫ్ఆర్ఓ వీరేష్, మన్ననూర్ ఎఫ్ఎస్ఒ సురేందర్, గుండం–ఈ బీట్ ఎఫ్బిఒ గోపాల్, వెటర్నరీ డాక్టర్ వి. రాజు, HyTiCoS కోఆర్డినేటర్, ఎన్టీసిఎ ప్రతినిధి బాపురెడ్డి, బయాలజిస్ట్ రవికాంత్, HyTiCoS రీసెర్చ్ అసోసియేట్ అఖిల్ గౌడ్‌తో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు
Tags
-
Home
-
Menu
