చిరుత పులి చర్మం స్వాధీనం.. ఆరుగురు అరెస్ట్

చర్ల రేంజ్ పరిధిలో చిరుత పులిని వేటాడి.. దాని చర్మం, గోళ్లు, పళ్లు, పుర్రెను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నఆరుగురు నిందితులను భద్రాచలం డివిజన్ అటవీ శాఖ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల మండలం కుర్నపల్లి గ్రామంలో వన్యప్రాణిని వేటాడుతున్నట్లు ఈ నెల 15న మధ్యాహ్నం సమాచారం అందింది. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. చిరుత పులిని వేటాడి..దాని శరీర భాగాలను రవాణా, విక్రయానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కుర్నపల్లికి చెందిన కోరుం నారాయణ, కిష్టారంపాడుకు చెందిన పోడియం దేవేందర్, బెస్తకొత్తూరుకు చెందిన అల్లం సాయి కిరణ్, గంగోనిగూడెంకు చెందిన జలకర రాధాకృష్ణ, కిష్టారంపాడుకు చెందిన పోడియం సంతోష్, డిల్లే బండిలను అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చిరుతపులి చర్మం, తొమ్మిది గోళ్లు, ఆరు పళ్లు, తలను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం-ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులను భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.
-
Home
-
Menu
