వికారాబాద్ లో చిరుత సంచారం

X
మన తెలంగాణ- హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పరిగి మండలం నస్కల్ సమీపంలో పొలంలో ఉన్న పశువులపై చిరుత దాడి చేసినట్లు సమాచారం. దీంతో స్థానిక రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల దోమ మండలం దిర్పంపల్లి సమీపంలోనూ చిరుత సంచారం కలకలం సృష్టించింది. తాజాగా నస్కల్ పరిసరాల్లో చిరుత కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. పొలాల వద్దకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. వరుసగా చిరుత సంచార ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో అటవీశాఖ అధికారులు స్పందించి పర్యవేక్షణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
