మెంగారం గ్రామ శివారులో చిరుత సంచారం..

మెంగారం గ్రామ శివారులో చిరుత సంచారం..
X

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మెంగారం గ్రామ శివారులో చిరుత సంచరిస్తూ వాహన దారులకు కనిపించడంతో ద్విచక్ర వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై పలుమార్లు చిరుత సంచరిస్తూ వాహనదారులకు కనిపించడంతో సెల్ ఫోన్ లో వీడియోలు తీసి రాత్రి పూట అటుగా ప్రయాణించే వాహనదారులను అప్రమత్తత చేసినట్టు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఎల్లారెడ్డి నుండి లింగంపేట్ వైపు కారులో వస్తున్న సమయంలో మెంగారం గ్రామ శివారులో కేకే వై ప్రధాన రహదారిపై

చిరుత మళ్లీ కనిపించినట్లు ప్రయాణికులు తెలిపారు. ఇటీవల కాలంలో తరచుగా చిరుతలు ప్రధాన రహదారిపై సంచరించడంతో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడానికి వాహనదారులు భయపడుతున్నారు. గత కొన్ని రోజులుగా మండలంలోని మెంగారం గ్రామ శివారులో, గాంధీనగర్, కంచు మల్ కొండాపూర్, కోమటిపల్లి గ్రామ శివారులో చిరుజల సంచారం పెరిగినట్లు గ్రామీణ ప్రజల వెల్లడించారు. చిరుతల నుండి ప్రమాదం పొంచి ఉన్నట్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు చిరుతలు రహదారుల పైకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బెంబర్ గ్రామ శివారులో దూడపై చిరుత దాడి

తానూర్ మండలంలోని బెంబర గ్రామ శివారులో చిరుత పులి దాడి కలకలం సృష్టించింది. గ్రామ శివారులోని తన పొలం వద్ద రైతు ప్యాదేకర్ దేవురావు ఆవు దూడను కట్టేసి ఇంటికి వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున పాలు పితకడానికి వెళ్లగా, రాత్రి సమయంలో చిరుత పులి దాడి చేసి ఆవు దూడ చంపేసినట్లు గుర్తించారు. ఈ ఘటనతో స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అడవికి సమీపంలో ఉన్న పొలాల్లోకి వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags

Next Story