ఎల్‌ఐసి నుంచి రెండు కొత్త పాలసీలు

ఎల్‌ఐసి నుంచి రెండు కొత్త పాలసీలు
X

ఎల్‌ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) రెండు కొత్త పాలసీలను ప్రారంభించింది. ఎల్‌ఐసి సిఇఒ, ఎండి ఆర్.దొరైస్వామి ఎల్‌ఐసి ప్రొటెక్షన్ ప్లస్ (ప్లాన్ 886), బీమా కవచ్ (887) ప్లాన్లను లాంచ్ చేశారు. ప్రొటెక్షన్ ప్లస్ నాన్ పార్ ఆధారిత సేవింగ్స్ ప్లాన్‌గా జీవత బీమా, పెట్టుబడి సౌకర్యాలను అందిస్తుంది. టాప్ అప్ ప్రీమియం, పార్ట్ విత్‌డ్రాయల్, సమ్ అష్యూర్డ్ మార్పులు చేయడానికి వీలుంది. దీనికి కనీస ప్రవేశ వయస్సు 18 ఏళ్లు, గరిష్టంగా 65 ఏళ్లు ఉంది. ఇక బీమా కవచ్ నాన్ లింక్డ్ ప్యూర్ రిస్క్ ప్లాన్‌గా ఉంది. లెవెల్, ఇన్‌క్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్లు, సింగిల్, లిమిటెడ్, రెగ్యులర్ ప్రీమియం చెల్లింపునకు వీలుంది. కనిష్ట సమ్ అష్యూర్డ్ రూ.2 కోట్లు ఉంటుంది. మహిళలు, నాన్ స్మోకర్స్‌కు ప్రత్యేక ప్రీమియం రేట్లు ఉంటాయి. జీవిత దశలలో కవరేజీ పెంచుకునే అవకాశం కూడా ఉంది.

Tags

Next Story