పిడుగుపాటుకు పేలిన మొబైల్ ఫోన్‌లు.. ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు

X
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో పిడుగుపాటుకు మొబైల్ ఫోన్‌లు పేలి ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. బొప్పావాడకు చెందిన మేకల సూర్యకాంత్, బూర్గుల్‌కు చెందిన గైని శంకర్‌లు ఆదివారం బొప్పాజివాడ శివారులోని పత్తి చేనులో గుంతలు తవ్వుతున్నారు. వర్షం రావడంతో ఇద్దరు గొడుగు పట్టుకొని నిలుచున్నారు.ఆ సమయంలో పిడుగు పడటంతో వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలై నాయి. గమనించిన స్థానికులు వారిని ఎడ్లబండిపై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామీణ రహదారి వరకు.. అక్కడి నుంచి అంబులెన్స్‌లో గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
