జనగామలో బైక్‌ను ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి

Lingala Ghanpur  Jangaon
X

Lingala Ghanpur Jangaon

లింగాలఘన్‌పూర్: జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. నవాబ్‌పేట వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలో చనిపోయారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story