చట్నీలో బల్లి.. 9 మందికి అస్వస్థత

X
జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో గల ఓ టిఫిన్ సెంటర్‌లో తయారుచేసిన చట్నీలో చనిపోయిన బల్లి కలకలం రేపింది. ఓ వ్యక్తి టిఫిన్ సెంటర్‌కు వెళ్లి అల్పాహారం తింటుండగా అతని ప్లేట్‌లో వేసిన చట్నీలో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా అవాక్కైన ఆ వ్యక్తి చట్నీలో వచ్చిన బల్లిని చూపిస్తూ ఇంత నిర్లక్షంగా వ్యవహరిస్తే ఎలా.. మా ప్రాణాలకు ముప్పువాటిల్లితే బాధ్యులెవరంటూ నిర్వాహకులను గట్టిగా నిలదీశాడు. అయితే అప్పటికే ఆ హోటల్‌లో టిఫిన్ చేసి చట్నీ తిన్న అశ్విని, లక్ష్మి, మంగ, శిరీష, నక్క లావణ్య, అన్విక, చంద్రయ్య, తిరుపతి, రాజశేఖర్ అనే వ్యక్తులు అస్వస్థతకు గురి కాగా వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు తెలిసింది. ఇదే హోటల్‌లో ఇప్పటికే ఇలాంటివి రెండు మూడు సంఘటనలు జరిగినట్లు పలువురు చెబుతున్నారు.
Next Story
-
Home
-
Menu
