హనుమకొండలో స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

హనుమకొండలో స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ
X


వరంగల్: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముల్కనూరు గ్రామ శివారులో స్కూల్ బస్సును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాణాపాయం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story