ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ సజీవదహనం

X
బేస్తవారిపేట: ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు వద్ద టమాటా లోడ్‌తో వెళ్తున్న లారీ టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ లో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ ను పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన దుర్గారావుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Next Story
-
Home
-
Menu
