సిద్దిపేటలో స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

సిద్దిపేటలో స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ
X

సిద్దిపేట: స్కూల్ పిల్లలను తీసుకొని వెళ్తున్న బస్సును సిమెంట్ లారీ ఢీకొట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇబ్రహాంనగర్‌లో జరిగింది. పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సిద్దిపేటలో రావూస్ స్కూల్ బస్సు పలు గ్రామాలలో విద్యార్థులను పిక్ అప్ చేసుకొని స్కూల్‌కు వెళ్తోంది. ఇబ్రహీంనగర్ స్టేజీ వద్దకు రాగానే బస్సును వెనుక నుంచి సిమెంట్ లారీ ఢీకొట్టింది. సిద్దిపేట వైపు ఉన్న బస్సు ఒక్కసారిగా కరీంనగర్ వైపు తిరిగింది. బస్సులో ఉన్న పిల్లలు భయంతో కేకలు వేశారు. వెంటనే గ్రామస్థులు పిల్లలను బస్సులో నుంచి బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిమెంట్ లారీ డ్రైవర్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లారీ, బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags

Next Story