వికారాబాద్ లో లారీ–బైక్ ఢీకొని యువకుడు మృతి

వికారాబాద్ లో లారీ–బైక్ ఢీకొని యువకుడు మృతి
X

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ద్విచక్రవాహనం ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. మృతుడిని బుద్లాపూర్ తండాకు చెందిన నేనావత్ రవి (28)గా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story