కోకాపేటలో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన లారీ

కోకాపేటలో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన లారీ
X

కోకాపేట: రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియోపోలీస్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రెడీమిక్స్ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. సర్వీసు రోడ్డుపై ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగం, నిద్ర మత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Next Story