జాతీయ రహదారిపై కారును ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

జాతీయ రహదారిపై కారును ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి
X

నిజామాబాద్: జిల్లాలోని డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 44వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మూర్‌ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని నిర్మల్‌ జిల్లా వాసిగా గుర్తించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story