అబ్దుల్లాపూర్ మెట్ లో .. డివైడర్ పైకి లారీ దూసుకెళ్లడంతో భారీగా ట్రాఫిక్

అబ్దుల్లాపూర్ మెట్ లో .. డివైడర్ పైకి లారీ దూసుకెళ్లడంతో భారీగా ట్రాఫిక్
X

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బ్రేకులు ఫెయిల్ అయి లారీ డివైడర్ పైకి దూసుకెళ్లింది. హైదరాబాద్- విజయవాడ హైవే పై లారీ నిలిచిపోవడంతో భారీ గా ట్రాఫిక్ నిలిచిపోయింది. రెండువైపులా వాహనాలు నెమ్మదిగా సాగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్రేన్ సహాయంతో లారీని తొలగించే చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణనష్టం తప్పడంతో అక్కడ వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Next Story