గోవాలో ప్రేమజంట... ఆ వీడియోలతో బెదిరింపులు.. సనత్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు

Love couple in Goa
X

Love couple in Goa

హైదరాబాద్: గోవాకు వెళ్ళి ఏకాంతంగా గడపాలనుకుంటున్న ప్రేమ జంటలు జాగ్రత్తగా ఉండాలని పోలీసుల సూచిస్తున్నారు. హోటల్ నిర్వహకులు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. గోవాలోని ఓ హోటల్ కు వెళ్లిన ప్రేమజంట వీడియోలు తీసి హోటల్ నిర్వహకులు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని వదిలేయాలని బాధితురాలు కోరినా కూడా వినకుండా డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఒక మహిళ(35), తన పెళ్లికిముందు 2023 సంవత్సరంలో ఒక వ్యక్తితో కలిసి గోవా వెళ్లింది. యశ్వంత్(40) అనే వ్యక్తి ఆ జంటకు బస, ఇతర ఏర్పాట్లు చేశాడు. ఇటీవల సదరు మహిళకు ఫోన్ చేసి, గతంలో మీరు సన్నిహితంగా ఉండే వీడియోలు తీశానని, రూ.30 లక్షలు ఇవ్వాలని యశ్వంత్ డిమాండ్ చేశాడు. తనకు ఇప్పుడు వేరే వ్యక్తితో పెళ్లయిందని తన వైవాహిక జీవితం చెడిపోతుందని వదిలేయాలని వేడుకుంది. యశ్వంత్ వినకపోవడంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story