కొత్తూరు లో ప్రేమ జంట ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం కొత్తూరు మండల కేంద్రంలో ఇద్దరు ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి ప్రేమ కథ ఆత్మహత్య రూపంలో విషాదాంతంగా ముగియడంతో కొత్తూరులో విషాదఛాయలు అలముకున్నాయి. పొట్ట చేత పట్టుకుని బీహార్ నుండి బ్రతుకుతెరువు కోసం కొత్తూరు వచ్చిన వలస కార్మికుడి కుటుంబంలో చెలరేగిన ఈ కల్లోలానికి ముక్కుపచలానని పసి హృదయాలు పాడే ఎక్కబోతున్నాయి. కొత్తూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న ట్రక్ డ్రైవర్ నవనీత్ దత్తకు ఇద్దరు కుమార్తెలు ఇందులో అనామిక (21) అనే యువతీ ధనుంజయ్ (25) అని యువకుడితో ప్రేమలో ఉంది.
అయితే వీరందరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. గత మూడు రోజులుగా అనామిక కంపెనీకి వెళ్లడం లేదు. సుమారు అనామిక కోసం ధనుంజయ్ ఇంటికి వచ్చాడు. అప్పటికే అనామిక ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. ఈ దృశ్యం చూసి తట్టుకోలేని ప్రేమికుడు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు కొత్తూరు సిఐ నరసయ్య తెలిపారు. ట్రక్ డ్రైవర్ తండ్రి నవనీత్ దత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఇంట్లో కనిపిస్తున్న సిసి కెమెరాకు సంబంధించిన ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటికీ అది సరిగ్గా పని చేయడం లేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపబోతున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని శంషాబాద్ ఎసిపి శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు.
-
Home
-
Menu
