ప్రేమపెళ్లి... 20 రోజుల తరువాత పారిపోయాడు... ధర్నాకు దిగిన యువతి

వికారాబాద్: ప్రేమించాడు.... ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఎదురించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన 20 రోజుల తరువాత అతడు కనిపించకుండాపోయాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.... గోకఫసల్‌వాద్ అనే నగ్రామంలో అశ్విని అనే యువతి అదే గ్రామానికి చెందిన బుగ్గప్ప అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో ఇంట్లో వాళ్లు నిరాకరించారు. ఇద్దరు పారిపోయి ఈ నెల 6న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో అద్దె గదిలో నివసిస్తున్నారు. బుగ్గప్ప కుటుంబ సభ్యులు వాళ్లకు ఫోన్ చేసి ఇంటికి రావొద్దని బెదిరించారు. గత మూడు రోజుల నుంచి బుగ్గప్ప కనిపించకపోవడంతో పాటు ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. దీంతో అశ్విని తన సొంతూరు వెళ్లి బుగ్గప్ప ఇంటికి వెళ్లింది. వాళ్ల కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోకి రానివకపోవడంతో ఇంటి ముందు ధర్నాకు దిగింది. గ్రామస్థుల సమాచారం మేరకు ఎస్‌ఐ తన సిబ్బందితో అక్కడి చేరుకొని యువతి ఫిర్యాదు మేరకు ఎస్‌సి, ఎస్‌టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
-
Home
-
Menu
