యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

Fire Accident
X

యువతిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన మహబూబాబాద్ పట్టణంలోని ప్రగతి నగర్ లో చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై యువకుడు పెట్రోల్ పోసి యువతితో పాటు తాను నిప్పింటించుకున్నాడు. అది గమనించిన స్థానికులు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం ఇద్దరిని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story