మంచిర్యాలలో పూజల పేరుతో బాలికపై నకిలీ బాబా అత్యాచారం

మంచిర్యాలలో పూజల పేరుతో బాలికపై నకిలీ బాబా అత్యాచారం
X

మంచిర్యాల: పూజల పేరుతో బాలికపై నకిలీ బాబా అత్యాచారం చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలం కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సతీష్‌ అనే బాబా మాయ మంత్రాల పేరుతో ప్రజలను మోసగిస్తుంటాడు. జగిత్యాల జిల్లాకు చెందిన బాలికకు అనారోగ్య సమస్యలు ఉండడంతో బాబా సతీష్ వద్దకు తీసుకెళ్లారు. పూజలు చేస్తానని బాలికను తల్లిదండ్రులను నమ్మించాడు. బాలికపై సతీష్ అత్యాచారం చేయడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూజల పేరుతో దొంగ బాబాలు సొమ్ములు కాజేయడంతో అత్యాచారాలకు పాల్పడుతున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Tags

Next Story