మద్దూరులో చెట్టుకు ఉరేసుకున్న యువకుడు

X
Maddur Narayanpet
నారాయణపేట: ఓ యువకుడు గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సందమోళ్ల భీమేష్(19) తన పొలానికి వెళ్లే మార్గంలో శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. గ్రామస్థులు గమనించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Tags
Next Story
-
Home
-
Menu
