మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. తల్లి, కుమర్తెలు ఆత్మహత్య

X
భూత్పూర్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. వెల్కిచర్ల గ్రామంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. ఇవాళ ఉదయం జంగమ్మ(47), తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. జ్యోతి (15), శైలజ 8 (13)ను తొలుత బావిలోకి తోసి, అనంతరం తాను కూడా దూకేసింది. ఆమె కుమారుడు తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృత దేహాలను వెలికి తీశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదె చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story
-
Home
-
Menu
