‘మహావీర్ కర్ణ’ వచ్చేది అప్పుడే

X
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు పెన్ మూవీస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్.. ఆర్‌వీ స్టూడియోస్‌తో కలిసి ‘మహావీర్ కర్ణ’ అనే ఎపిక్ హైబ్రిడ్ లైవ్ యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. భారతీయ సినిమాను సరికొత్త విజువల్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతంలోని చిరస్మరణీయమైన కర్ణుడి కథను ఆధారంగా చేసుకుని ‘మహావీర్ కర్ణ’ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ‘మహావీర్ కర్ణ’కు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్‌లో కర్ణుడి ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని బలంగా చూపించారు. ఈ చిత్రం డిసెంబర్ 4న గ్రాండ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Next Story
-
Home
-
Menu
