‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్‌లో మహేశ్ ఎంట్రీ కోసం ఇంత కష్టపడ్డారా.!

మహేశ్‌బాబు హీరోగా.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘వారణాసి’. పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించేందుకు ఈ నెల 15వ తేదీన ‘గ్లోబ్‌ట్రాటర్’ పేరుతో ఓ భారీ ఈవెంట్ నిర్వహించారు. సాధారణంగా రాజమౌళి తన సినిమాల ఈవెంట్స్‌లో హీరోల ఎంట్రీని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంటారు. అలాగే ఈ ఈవెంట్‌లోనూ మహేశ్ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేశారు రాజమౌళీ
ఈ ఈవెంట్‌లో మహేశ్ బాబు ఎంట్రీ హైలైట్‌గా నిలిచింది. భారీ వృషభం(బొమ్మ)పై మహేశ్ ఈ ఈవెంట్‌లో ఎంట్రీ ఇచ్చారు మహేశ్. అయితే ఈ ఎంట్రీ కోసం ఎంత కష్టపడ్డారో ఓ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. వృషభం బొమ్మని ఎలా తయారు చేశారో.. దాని కోసం ప్రత్యేకంగా ఓ ట్రాక్‌ని నిర్మించడం.. ముందు రాజమౌళి దానిపై వెళ్లి ట్రయల్ వేయడం.. ఆ తర్వాత మహేశ్ దానిపై వెళ్లడాన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఎంతో మంది ఇంతలా కష్టపడ్డారు కాబట్టే ఈ ఈవెంట్ మహేశ్ ఎంట్రీ అంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.
ఇక సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మందాకినీ అనే పాత్రలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 2027 సమ్మర్‌లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.
-
Home
-
Menu
