బిజెపిది ద్వంద్వ వైఖరి:మహేష్ కుమార్ గౌడ్

బిజెపిది ద్వంద్వ వైఖరి:మహేష్ కుమార్ గౌడ్
X

దేశ క్రీడాకారుడు అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే బిజెపి నాయకులు ద్వంద్వ వైఖరితో అడ్డుకుంటున్నారని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో బిజెపి రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లా శ్రీ కరుణ్‌పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్‌సింగ్‌ను క్యాబినెట్‌లో మంత్రిగా చేశారు. ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రిగా చేస్తే తప్పులేనిది? అజారుద్దీన్ మంత్రి చేస్తే తప్పేంటని బిజెపి నేతలను సూటిగా ప్రశ్నించారు. బిజెపి, బిఆర్‌ఎస్ చీకటి ఒప్పందాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు. అజారుద్దీన్ కేబినెట్‌లోకి తీసుకోవాలని సిఎం భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బిజెపి కుటీల ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. క్రీడా ప్రపంచానికే కాదు ఎంపీగా అజారుద్దీన్ ప్రజలకు సేవలందించారు.

అజారుద్దీన్‌ను మంత్రి కాకుండా ఎలక్షన్ కమిషన్‌కు బిజెపి నేతలు ఫిర్యాదు చేయడం విచారం వ్యక్తం చేశారు. అనైతికంగా అజారుద్దీన్ మంత్రి కాకుండా బిజెపి, బిఆర్‌ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అజారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించకుండా రాష్ట్ర గవర్నర్‌పైన బిజెపి ఒత్తిడి తీసుకువస్తోందని సమాచారం ఉందని తెలిపారు. బిజెపితో బిఆర్‌ఎస్ కుమ్మక్కై ఉందని కెసిఆర్ కూతురు కవిత స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. మైనార్టీలకు లబ్ది చేకూరుతుందనే ఉద్దేశ్యంతోనే అజారుద్దీన్ ప్రమాణ స్వీకారాన్ని బిజెపి అడ్డుకుంటోందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. అజారుద్దీన్, కోదండరాంను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసి కేబినెట్ గవర్నర్‌కి పంపింది. అక్కడ పెండింగ్‌లో ఉంది. కోర్టులో గెలిచి తీరుతామన్న నమ్మకముందని అన్నారు. అజారుద్దీన్ కేబినెట్‌లోకి రావడం ఖాయమని ఖరాఖండిగా పేర్కొన్నారు. కార్యక్రమంలో గడుగు గంగాధర్, అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story