జగ్గారెడ్డి సభ వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: మహేశ్ కుమార్ గౌడ్

2017లో రాహుల్ గాంధీ సభను సంగారెడ్డిలో జగ్గారెడ్ది ఏర్పాటు చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఏ కార్యక్రమం చేపట్టినా అది రాష్ట్రంలో కీలక మలుపుగా మారుతుందన్నారు. రాహుల్ గాంధీ సభ వేదికపై కేవలం 50 మంది ఉండాల్సి ఉండగా.. సంగారెడ్డి సభలో జగ్గారెడ్డి 150 మందిని కూర్చోబెట్టారన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు పేదల జీవితాల్లో మలుపు తిప్పే యంత్రమన్నారు. ఈ కార్డుతోనే పేదలకు నిత్యావసర సరకులు, సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. రేషన్ కార్డు ప్రతి పేదవాడి జీవితంతో ముడిపడి ఉన్న అంశమని ఆయన వివరించారు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. పదేళ్లు వారి నెత్తిన శని కూర్చుందేమో అని విమర్శించారు.
-
Home
-
Menu
