నెట్‌ఫ్లిక్స్ ప్రతిపాదనపై ఎంఎఐ ఆందోళన

న్యూఢిల్లీ : వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సంసిద్ధత వ్యక్తం చేయడంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఎఐ) శనివారం ఆందోళన వెలిబుచ్చింది. ఇది భారతదేశ థియేట్రికల్ మరియు విస్తృత చలనచిత్ర ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష పోటీతో పాటు ఆర్థిక ముప్పును తెచ్చిపెడుతుందని హెచ్చరించింది.
భారతదేశ విస్తృత చలనచిత్ర ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష ఆర్థిక ముప్పుగా మారుతుందని ఎంఎఐ ఒక ప్రకటనలో తెలిపింది. వారసత్వ హాలీవుడ్ దిగ్గజం యొక్క స్టూడియో మరియు స్ట్రీమింగ్ వ్యాపారాన్ని 72 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ శుక్రవారం వెల్లడించింది. ఎంఎఐ అధ్యక్షుడు కమల్ జ్ఞాన్‌చందానీ మాట్లాడుతూ, భారతీయ థియేట్రికల్ మార్కెట్ ఎంపిక, స్థాయి, సాంస్కృతిక వైవిధ్యంపై వృద్ధి చెందుతుందని అన్నారు.
-
Home
-
Menu
