నిజామాబాద్ లో భర్త హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని నమ్మించింది... పోలీసులకు చేసిన ఫోన్ కాల్ తో

Maklure Nizamabad
X

Maklure Nizamabad 

నిజామాబాద్: భర్తను ప్రియుడితో కలిసి చంపి అనంతరం హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడని అందరిని నమ్మించిన అంత్య క్రియలు చేసింది. దుబాయ్‌లో ఉన్న మృతుడి తమ్ముడికి అనుమానం రావడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోర్గాం(కె) గ్రామంలో పల్లాటి రమేశ్(35), సౌమ్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్ద కుమారులు, ఒక కుమార్తె ఉంది. డిసెంబర్ 20న గుండెపోటుతో భర్త చనిపోయాడని బంధువులు, గ్రామస్థులను నమ్మించి అంత్యక్రియలు చేసింది. రమేశ్ మెడపై గాట్లు ఉండడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చి మృతుడి తమ్ముడికి సమాచారం ఇచ్చారు. తమ్ముడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకొని భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సౌమ్య పని చేస్తున్నారు. అదే పాఠశాలలో పిఇటిగా పని చేస్తున్న నాలేశ్వర్ దిలీప్ పరిచయం కావడంతో అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం రమేశ్‌కు తెలియడంతో భార్యతో పలుమార్లు గొడవకు దిగాడు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి ప్రియురాలు ప్లాన్ వేసింది. రమేష్ బైక్‌పై వెళ్తుండగా దిలీప్ కారుతో ఢీకొట్టడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సుపారీ గ్యాంగ్‌తో చంపించాలని భార్య నిర్ణయం తీసుకొని 35 వేల రూపాయలకు బంగారం అమ్మి సదరు గ్యాంగ్‌కు ఇచ్చింది. మంచి నీటిలో నిద్రమాత్రలు కలిపి రమేష్‌కు ఇచ్చింది. అతడు గాఢనిద్రలోకి జారుకున్న తన సుఫారీ గ్యాంగ్ ఫోన్ చేసింది. వారు అందుబాటులో లేకపోవడంతో తన ప్రియుడు దిలీప్‌కు సమాచారం చెప్పింది. వెంటనే ప్రియుడు తన తమ్ముడు అభిషేక్‌తో కలిసి సౌమ్య ఇంటికి వచ్చారు. ముగ్గురు కలిసి రమేష్ మెడకు టవల్ చుట్టి చంపేశారు. అనంతరం ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రియుడు, ప్రియురాలు, దిలీప్ సోదరుడు, సుపారీ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Next Story