మక్తల్‌లో విద్యుత్ తీగలు తగిలి లారీ డ్రైవర్ మృతి

X
మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ తీగలు తగలడంతో లారీ డ్రైవర్ మృతి చెందాడు. మసాలా ప్యాకెట్ల లోడుతో లారీ మక్తల్ మండల కేంద్రానికి చేరుకుంది. లారీపై కప్పిన ప్లాస్టిక్ కవర్‌ను డ్రైవర్ కుర్వ వెంకటేశ్(25) తొలగిస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో అతడు కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు, అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. వెంకటేశ్‌కు భార్యతో పాటు నాలుగేళ్ల కూతురుతో కలిసి గద్వాల్ జిల్లా కేంద్రంలోని దౌదరపల్లిలో నివసిస్తున్నాడు. దీంతో దౌదరపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Tags
Next Story
-
Home
-
Menu
