నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్

Multiple Marriages Fraud
మాయమాటలు చెప్పి పెళ్లి పేరుతో మహిళల దగ్గర డబ్బు, బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయి తప్పించుకొని తిరుగుతున్న నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు భువనగిరి పట్టణ సీఐ రమేష్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప పట్టణానికి చెందిన సోమారపు సురేంద్ర 2021లో క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా భువనగిరి పట్టణానికి చెందిన మహిళకి పరిచయమై ఆమెకు తప్పుడు ఉద్యోగ, వ్యాపార వివరాలు చెప్పి నమ్మబలికి ‘మైనింగ్‌లో ఉన్నాను, కన్సల్టెన్సీ నడుపుతున్నాను, పెట్రోల్ బంక్ వచ్చేసింది‘ అంటూ తప్పుడు హామీలు ఇచ్చి రూ‘ 15,00,000 నగదును 30 తులాల బంగారు నగలు తీసుకొని మోసం చేసి 2024 నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ముందుగా మరొక మహిళ కృష్ణవేణిని వివాహం పేరుతో 12 లక్షల వరకు మోసం చేసి, రూ‘ 7,00,000కు రాజీ చేసుకున్న విషయం బయటపడిందని, కృష్ణ వేణి అతన్ని వెతుక్కుంటూ ఫిర్యాదు రాలి ఇంటికి రావడంతో, ఫిర్యాదురాలి తల్లిదండ్రులు భయట తెలిస్తే పరువు పోతుందని కృష్ణవేణీకి ఫిర్యాదురాలి తల్లిదండ్రులు రూ‘ 6,00,000 రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు.
అలాగే మిడియేటర్ జూపల్లి కిరణ్ కుమార్ ద్వారా మరో మహిళ శైలజా విషయంలో కూడా 2.50 లక్షలు తీసుకొని మోసం చేసినాడని, తరువాత విజయవాడకు చెందిన రత్నకుమారి వద్ద కూడా సురేంద్ర 2 లక్షలు రూపాయలు మోసగించినట్లు ఫిర్యాదురాలికి తెలిసింది. వివాహం అయిన తర్వాత కూడా తనను ఇంటికి తీసుకెళ్లకుండా, తరచూ డబ్బులు, ఇంటి పేపర్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ, శారీరక, మానసిక హింస చేశాడని పెర్కోన్నారు. అతడి ప్రవర్తనపై విసుగు చెందిన మహిళ అతనిని ప్రశ్నించగా ‘మీకు నాకు సంబంధం లేదు, మీరు నాకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదని మెసేజ్ పెట్టి ఆమె ఫోన్ నంబర్ నీ బ్లాక్ చేసి ఆమెని వదిలి పారిపోయాడు. నిందితుడికి ఒక కరీంనగర్ కి చెందిన లేడితో 2017 లో వివాహం చేసుకొని 2020 లో ఆమెతో కూడా విడాకులు తీసుకున్నట్లు విచారణలో తేలినట్లు తెలిపారు. ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేసి ఎంతోమంది మహిళలను వివాహం పేరుతో మోసం చేశాడని, పిర్యాదురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన భువనగిరి పట్టణ సిఐ రమేష్ ప్రత్యేక బృందం ద్వారా నిందితుడు సోమవారపు సురేంద్రను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ రమేష్ తెలిపారు.
-
Home
-
Menu
