కూతురు ప్రేమ వివాహం..యువకుడు, అతని తండ్రిపై దాడి.. ఇంటికి నిప్పు

Man Attacks Son-in-law
X

Man Attacks Son-in-law

పెంచి పోషించిన కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో జీర్ణించుకోలేని తండ్రి, కొడుకులు ఆ యువకుడి ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండల పరిధిలోని కక్కర్‌వాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు స్థానిక ఎస్‌ఐ పాటీల్ క్రాంతికుమార్ కథనం ప్రకారం ఇలా ఉన్నాయి... గ్రామానికి చెందిన గొల్ల విఠల్ కుమార్తె అదే గ్రామానికి చెందిన బోయిని నాగేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇది నచ్చని విఠల్, తన కుమారుడు గొల్ల పాండుతో కలిసి ఆ యువకుడితో పాటు ఆయన తండ్రి బోయిని రాములుపై భౌతిక దాడి చేయడంతో పాటు ఇంటికి నిప్పుపెట్టారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా వారు వచ్చి మంటలు ఆర్పారు. బాధితుడు బోయిని నాగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags

Next Story