గోనె సంచిలో వ్యక్తి మృతదేహం

గోనె సంచిలో వ్యక్తి మృతదేహం
X

కామారెడ్డి పట్టణంలో సంచిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. ముక్కలు ముక్కలు చేసిన సగం మృతదేహాన్ని దుండగులు మూటగట్టి పడేశారు. పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి సమీపంలోని చెత్త కుప్పలో కాగితాలు ఏరుకునే వారికి గోనె సంచిలో నుంచి కాళ్లు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని గోనె సంచిని తెరిచి పరిశీలించగా తల నుంచి నడుం భాగం వరకు లేకుండా నడుం నుంచి కాళ్ల వరకు మాత్రమే ఉన్న మృతదేహం లభించింది. మృతదేహంలోని మిగతా భాగం కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహం సగం మాత్రమే ఉండడంతో మృతుడు ఎవరో గుర్తించడం కష్టంగా మారిందన్నారు. రెండు మూడు రోజుల క్రితమే హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా కోసి గోనె సంచిలో కట్టి ఇక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Tags

Next Story