లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

X
వేములవాడ పట్టణంలో ఓ లాడ్జ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. జాతర గ్రౌండ్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు లాడ్జిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఇది హత్యనా..? లేక ఆత్మహత్యనా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు ఎవరు...? ఎక్కడి నుండి వచ్చాడు.. అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Next Story
-
Home
-
Menu
