ఘట్ కేసర్ లో తలపై ఇటుకతో కొట్టి... మర్మాంగాన్ని కట్ చేసి

ఘట్ కేసర్ లో తలపై ఇటుకతో కొట్టి... మర్మాంగాన్ని కట్ చేసి
X

తల్లిని దూషించాడనే కక్షతో దారుణం.. సిమెంట్ ఇటుకతో దాడి.. కత్తితో వికృత చర్య.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మన తెలంగాణ - క్రైమ్ డెస్క్: డబ్బుల విషయంలో జరిగిన గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో మద్యంతో మత్తులో ఇటుకతో దాడి చేసి అనంతరం కత్తితో పలుమార్లు పొడవడంతో మర్మాంగాన్ని కట్ చేశాడు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ మండలంలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అవుషాపూర్ కు చెందిన బాలుడు, శివ అనే వ్యక్తితో కలిసి జగన్‌కు చెందిన స్ప్రైట్ క్యాన్ వద్ద వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. దీనికితోడు శివ తనను, తన తల్లిని దూషించాడనే కారణంతో బాలుడు అతడిపై పగతో రగిలిపోతున్నాడు. ఆదివారం రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన బాలుడు శివపై దాడికి పాల్పడ్డాడు. సిమెంట్ ఇటుకతో ముఖం, తలపై కొట్టడంతో శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం గదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో అతడిని పలుమార్లు పొడవడంతో పాటు మర్మాంగాన్ని కోసేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం అవుషాపూర్ లో అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపడుతామని పోలీసులు వెల్లడించారు.

Tags

Next Story