ప్రేమ పెళ్లి చేసుకున్నాడని.. యువకుడి ఇంటిని కూల్చేశారు..

X
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న దళిత యువకుడి ఇంటిని యువతి కుటుంబ సభ్యులు కూల్చేశారు. గద్వాల మండలం రేపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు ఇటీవల హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో యువకుడి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. జెసిబిలతో ఇంటిని కూల్చివేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
Next Story
-
Home
-
Menu
